బాబు నీ వేశాలు ఇక్కడ కాదు…బాల్క సుమన్

-

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అతికతెలివి తేటలను ఏపీలో ప్రదర్శించుకుంటే మంచిది ఇక్కడ మీ వేశాలు కుదరవ్ అంటూ ఎంపీ బాల్కసుమన్ తీవ్ర స్థాయిలో బాబు పై మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అక్రమ సంపాదనను తెలంగాణలో ఖర్చు పెట్టి తెలంగాణను విచ్ఛిన్నం చేయాలని చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నారని ఆరోపించారు. కొంత మంది ఏపీ ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు తెలంగాణలో క్యాంపు ఏర్పాటు చేసుకోవడాన్ని బాల్క సుమన్ తప్పుబట్టారు.

ఇంతకాలం చంద్రబాబుపై కేసులు వేసిన కాంగ్రెస్ నేతలు నేడు చంద్రబాబు చేతులు పట్టుకోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటీ అంటూ ప్రశ్నించారు. తెదేపా ఏజెంట్లు కొంత మంది కాంగ్రెస్ లో ఉన్నారన్నారు. ఆయన చేసిన, చేస్తోన్న కుట్రలకీ నాలుగైదు సార్లు జీవిత ఖైదు శిక్ష వేసినా తక్కువే అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం కేసులు పెడితే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు రద్దుచేయాలని అడగాలని ప్రశ్నించారు. ఇకనైనా తెలంగాణ పట్ల ఆయన కుట్రలను ఆపకపోతే ఆయన్ను తరిమి కొట్టే పరిస్థితి వస్తుందని సుమన్ హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news