మహేష్ ముఖం బండరాయని.. సారీ అనేస్తున్నాడు

-

నేషనల్ వైడ్ గా సూపర్ స్టార్ మహేష్ ఫాలోయింగ్ ఏంటో అందరికి తెలిసిందే. తెలుగులోనే సినిమాలు తీసినా సరే సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా మహేష్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే లేటెస్ట్ గా ఓ తమిళ అప్కమింగ్ కమెడియన్ మహేష్ మీద చేసిన వాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.

తమిళ స్టాండప్ కామెడీ షోలో మనోజ్ ప్రభాకర్ అనే వ్యక్తి మహేష్ మీద వ్యక్తిగత దూషణకు దిగాడు. మహేష్ ముఖం బండరాయని.. అతనికి ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడమే రాదని అన్నాడు. ఆ వీడియో యూట్యూబ్ లోంచి డిలీట్ చేసేదాకా మనోజ్ మీద విపరీతమైన ట్రోల్స్ చేశారు. మహేష్ ఫ్యాన్స్ మనోజ్ అతను కనబడితే కొట్టేంత ఊపు చేస్తున్నారు.

అయితే మనోజ్ ఫైనల్ గా మహేష్ రాక్ స్టార్ అని.. తాను అలా చెప్పేందుకు మొహాన్ని బండ రాయితో పోల్చాడట. మహేష్ ను కాని.. ఆయన్ ఫ్యాన్స్ కాని తానేమి దూషించలేదని అంటున్నాడు మనోజ్. తెలుగు రెండు రాష్ట్రాలలో మహేష్ సూపర్ స్టార్ అనిపించుకుంటుండగా.. ఓవర్సీస్ లో కూ మహేష్ ను మించినవాడు లేడని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news