ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహారం రోమ్ చక్రవర్తి నోరో రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లు ఉందంటూ… భాజపా ఎంపీ జీవీఎల్ నరసింహారావు బాబుపై మండిపడ్డారు. ఓ వైపు రాష్ట్రంలో ఓవైపు తుఫాన్ బీభత్సం సృష్టిస్తుంటే.. పాలన గాలికి వదిలేసి పక్క రాష్ట్రాల్లో చంద్రబాబు పర్యటనలేంటని ప్రశ్నించారు. ప్రకృతి విపత్తులను పట్టించుకోకుండా కాంగ్రెస్ సీఎంల ప్రమాణస్వీకారానికి వెళ్లడం పద్ధతి కాదంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు తీరు రోమన్ చక్రవర్తి నీరోలా ఉందంటూ ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
‘ఒక పక్క పెథాయ్ తుఫాను అల్ల కల్లోలం సృష్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు జైపూర్, భోపాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం రోమన్ చక్రవర్తి నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ఉంది. @ncbn గారు, మరీ ఇంత నిర్లక్ష్యమా? మీరు చక్రవర్తి కాదు; ఆంధ్ర ప్రజలు రోమన్లు కాదు, భరించటానికి’అంటూ మండిపడ్డారు. అయితే జీవీఎల్ కామెంట్స్ పై కొందరు సానుకూలంగా స్పందించగా మరికొందరు జీవీఎల్ ని విమర్శించారు.
ఒక పక్క పెథాయ్ తుఫాను అల్ల కల్లోలం సృష్టిస్తుంటే చంద్రబాబు నాయుడు గారు జైపూర్, భోపాల్ ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం రోమన్ చక్రవర్తి నీరో రోమ్ తగలబడుతుంటే ఫిడేల్ వాయించినట్లుగా ఉంది. @ncbn గారు, మరీ ఇంత నిర్లక్ష్యమా? మీరు చక్రవర్తి కాదు; ఆంధ్ర ప్రజలు రోమన్లు కాదు, భరించటానికి. pic.twitter.com/iw5bA64EXX— GVL Narasimha Rao (@GVLNRAO) December 17, 2018