ఇదంతా టెక్నాలజీ యుగం కదా. కానీ.. ఇన్ని రోజులు మనం ఏమనుకున్నాం. కేవలం మనుషులు మాత్రమే టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారనుకుంటున్నాం కానీ… ఓ రామ చిలుక కూడా టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటుందో తెలిస్తే మీరు నోరెళ్లబెడతారు. అది ఆన్ లైన్ లో షాపింగ్ చేస్తుంది. ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. సాంగ్స్ వింటుంది. ఇలా.. తనకు నచ్చిన పనిని చేస్తుంది.. అందుకే దాన్ని స్మార్ట్ ఫ్యారెట్ అని పిలుస్తారు. స్మార్ట్ చిలుక అన్నమాట.
దాని పేరు రొక్కో. ఇంగ్లాండ్ లోని బెర్క్ షైర్ లో ఉన్న నేషనల్ యానిమల్ వెల్ఫేర్ ట్రస్ట్ సాంక్షుయరీలో ఉండేది ఒకప్పుడు. అయితే.. అది మాట్లాడే చిలుక కావడంతో అదే సాంక్షుయరీలో పని చేసే మారియన్ విచ్ నెస్కీ అనే మహిళ తన ఇంటికి తీసుకెళ్లి పెంచుకుంటోంది.
తన ఇంటికి తీసుకెళ్లాక చాలా స్మార్ట్ గా తయారైపోయిందట ఈ చిలుక. అమెజాన్ అలెక్సా కు వాయిస్ సందేశాలు పంపిస్తూ ఆన్ లైన్ షాపింగ్ చేయడాలు, ఫుడ్ ఆర్డర్ చేయడం చేస్తుందట. మ్యూజిక్ కూడా వింటుందట అది. అది చేయని చిలిపి పని లేదంటూ చెబుతంది దాన్న పెంచుకుంటున్న మారియన్. అది ఆర్డర్ చేసిన వస్తువులన్నింటినీ.. మారియన్ మళ్లీ క్యాన్సల్ చేయాల్సి వస్తుందట రోజు. భలే చిలుక కదా.