బిగ్ బాస్2 విన్నర్ కౌశల్

-

 

బిగ్ బాస్2 టైటిల్ని కౌశల్ సాధించారు. ముఖ్యఅతిథిగా హాజరైన విక్టరీ వెంకటేశ్ కౌశల్ ని విజేతగా ప్రకటించారు. దాదాపు మూడున్నర నెలలపాటు కొనసాగిన ఈ రియాలిటీషో ఆదివారం ఫైనల్ కి చేరింది. ఫైనల్లో కౌశల్, గీతామాధురి, దీప్తీ, తనీష్, సామ్రాట్ లు నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో వరుసగా సామ్రాట్, దీప్తీ, తనీష్ ఎలిమినేట్ కాగా గీతామాధురి-కౌశల్ టైటిల్ విన్నర్ కి పోటీ పడ్డారు.

అయితే బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని  విధంగా విజేత ఎంపిక కోసం రికార్డు స్థాయిలో ప్రేక్షకులు ఓట్లు వేశారు. దాదాపు 25 కోట్లకు పైగా ఓట్లు ఫైనల్లో ఉన్న వారికి  వచ్చినట్లు తెలుస్తోంది. వీటిలో అధికంగా కౌశల్ పడటంతో విజేతగా ప్రకటించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news