బీరు బిర్యాని వద్దు..బీరుతో పన్నీరే ముద్దు..అప్పుడే బరువు తగ్గుతారట..!!

-

మద్యం తాగితే బరువు పెరుగుతారని ఇన్ని రోజులు మనం చాలా బలంగా నమ్మాం..కానీ బరువు పెరగడానికి కారణం ఆల్కాహాల్‌ కాదు. అది తాగేప్పుడు తీసుకునే స్టఫింగ్.. బీరు తాగుతూ ఇప్పుడు చెప్పుకోబోయే స్టఫింగ్‌ తీసుకుంటే..బరువు తగ్గుతారట.. తాజా అధ్యయనం చెప్తున్న వాస్తవాలు ఇవి..
ఆల్కహాల్‌తో పాటు తినే స్టఫ్ కచ్చితంగా ప్రొటీన్ ఎన్ రిచ్డ్ అయితే మంచిదని నిపుణులు అంటున్నారు. కార్బోహైడ్రేట్లు జోడిస్తే ముందే ఆల్కహాల్ లో కేలరీలు ఉంటాయి. వాటికి తోడు కార్బోహైడ్రేట్ల కేలరీలు కూడా జత చేరి బరువు పెంచేసే ప్రమాదం పొంచి ఉంటుంది. ప్రొటీన్ తీసుకున్నపుడు కడుపు నిండుగా ఉన్న భావన కలిగి తక్కువ తింటాం. ఫలితంగా అదనపు క్యాలరీలు శరీరంలో చేరవనేది నిపుణుల వాదన. దీనికోసం ప్రత్యేకంగా ఒక అధ్యయనం కూడా నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వారిలో మూడింట రెండు వంతుల మంది ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారమే ఎంచుకున్నారు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకున్నారు. అందువల్ల ఆల్కహాల్‌తో కలిపి 1749 క్యాలరీలు మాత్రమే శరీరంలో చేరాయి. Beer diet for weight loss: Good or bad? - Times of India
నిజానికి వారు ఉన్న బరువును అలాగే కొనసాగించేందుకు అవసరమయ్యే క్యాలరీల కంటే దాదాపు 577 కేలరీలు తక్కువ. సాసేజ్ రోల్స్, క్రిస్ప్స, బిస్కెట్ల వంటివి రుచికి బావుండి, ప్రొటీన్ తక్కువ, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలు.. ఆల్కహాల్‌తో పాటు తీసుకున్నవారి శరీరాల్లో సగటున 3051 క్యాలరీలు చేరాయి. అది వారికి అవసరమైన దానికంటే దాదాపు 813 క్యాలరీలు ఎక్కువ.
ఈ అధ్యయనం వారి ఆహార అలవాట్లను పరిగణనలోకి తీసుకొని నిర్వహించారు. 9341 మంది వ్యక్తులకు సంబంధించిన డాటాను ఆస్ట్రేలియన్ నేషనల్ న్యూట్రిషన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ సర్వే వారు ఈ అధ్యయనానికి ఎంచుకున్నారట.. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల పెరిగే ఆకలిని చల్లార్చుకోవడానికి మంచి ప్రొటీన్ కలిగిన ఆహారాన్ని ఎంచుకోవడం వల్ల బరువు పెరిగే ప్రమాదం దాదాపు ఉండదని వైద్యులు అంటున్నారు..
బీరు ప్రియులు బరువు పెరుగుతామని భయపడకుండా తాగేయొచ్చు..అయితే బీరుతో పాటు స్టఫింగ్‌కు శాకాహారులైతే ఏ పన్నీరు ముక్కలో, లేదా పల్లీలో, జీడిపప్పులో తినండి.. మాంసాహారులైతే చికెన్ కబాబులో, చేప ముక్కలో తినాలని గుర్తుంచుకోండి. బీరుతో బిర్యానీ లాగిస్తే మాత్రం ప్రమాదమే మరి. బీరు బిర్యాని వద్దు, బీరుతో పన్నీరే ముద్దు..!!

Read more RELATED
Recommended to you

Exit mobile version