మళ్లీ రోడ్ల మీదకు వచ్చిన రెజ్లర్లు.. కానీ ఈసారి ఆ ముగ్గురే టార్గెట్‌..

-

గత సంవత్సర కాలంగా పోరుబాట పట్టిన భారత రెజ్లింగ్ సమాఖ్య డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్‌ బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను అరెస్ట్‌ చేయాలని రెజ్లర్లు పోరాటం చేశారు . అయితే ఆ ఆందోళనలు చేసినవారిలో కీలకంగా వ్యవహరించిన బజరంగ్‌ పునియా, వినేశ్‌ ఫోగట్‌,సాక్షి మాలిక్‌లకు వ్యతిరేకంగా జూనియర్‌ రెజ్లర్లు రోడ్లమీదకు వచ్చారు. ఈ ముగ్గురి వల్ల తమ కెరీర్‌ ప్రశ్నార్థకమవుతున్నదని, వారి నుంచి భారత రెజ్లింగ్‌ను కాపాడాలని నినదిస్తూ ఢిల్లీ లో జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన చేపట్టారు.

హర్యానా,ఉత్తరప్రదేశ్‌ నుంచి వందలాదిగా తరలివచ్చిన రెజ్లర్లు.. ఢిల్లీలో ఆందోళనకు దిగారు. సుమారు 300 మందికి పైగా జూనియర్‌ రెజ్లర్లు తరలిరాగా, అందులో ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పట్ నుంచి అధికంగా రెజ్లర్లు వచ్చారు. ఈ ముగ్గురి రెజ్లర్ల చెర నుంచి కాపాడండి..’ అని బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు.

 

ఉత్తరప్రదేశ్లో సుమారు 90 శాతం ట్రైనింగ్‌ సెంటర్స్‌, అక్కడ శిక్షణ పొందుతున్న వేలాది మంది రెజ్లర్లు ఈ నిరసన కు దిగారు. పునియా, వినేశ్‌, సాక్షి ఒకవైపు ఉండగా దేశంలోని లక్షలాది మంది రెజ్లర్లు మరోవైపు ఉన్నారు. జాతీయ అవార్డులు అంటే గౌరవం వాళ్లకు లేదని , కేంద్రం అందజేసిన ఆ అవార్డులను రోడ్లపై పెట్టి వెళ్తున్నారని వారు తెలియజేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version