Minister Ponnam Prabhakar : జీహెచ్‌ఎంసీ పరిధిలో 10 లక్షల దరఖాస్తుల స్వీకరణ : మంత్రి పొన్నం ప్రభాకర్‌

-

ఇప్పటి వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం కింద ఆరు గ్యారంటీ పథకాలకు పది లక్షల అప్లికేషన్లు స్వీకరించినట్లు హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌ వెల్లడించారు. బుధవారం ముషీరాబాద్‌ సర్కిల్‌ భోలక్‌పూర్‌ వార్డులోని అంజుమన్‌ స్కూల్‌లో నిర్వహించిన దరఖాస్తు స్వీకరణ కౌంటర్‌ను జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ,కమిషనర్‌ రోనాల్డ్‌రోస్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, పెన్షన్‌, మహాలక్ష్మీ, ఇందిరమ్మ ఇల్లు ,సబ్సిడీ గ్యాస్‌ లకు సంబంధించిన దరఖాస్తులు అందాయని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 45 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమల్లోకి తీసుకురాగా, ఇప్పటి వరకు ఆరున్నర కోట్ల మంది ఉచిత ఆర్టీసీ ప్రయాణాన్ని ఉపయోగించుకున్నారని తెలిపారు.ప్రతి ఇంటి నుంచి ఒక దరఖాస్తును స్వీకరించాం అని తెలిపారు. ఆరు గ్యారంటీలతో పాటు రేషన్‌కార్డు, బస్తీ సమస్యలపై కూడా దరఖాస్తులు సమర్పించవచ్చని అన్నారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 150 వార్డులలో 600 కేంద్రాల్లో దరఖాస్తు స్వీకరణ కౌంటర్లు ఏర్పాటు చేశామని పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version