డబ్బులను ఆదా చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ 6 టిప్స్ ని ఫాలో అవ్వండి..!

-

కొంతమంది డబ్బులు ఎంత సంపాదిస్తున్నా సేవింగ్స్ చేయలేకపోతుంటారు. మీరు కూడా డబ్బుల్ని ఆదా చేయాలనుకుంటున్నా కుదరట్లేదా…? అయితే ఇలా ఆదా చేసుకోండి. డబ్బులు ఆదా చేయడం అంటే ఈజీ కాదు. కానీ చిన్న చిన్న టిప్స్ తో డబ్బులు ఆదా చేసుకోవడానికి అవుతుంది.

  • మీరు సామాన్లు కొనుగోలు చేయడానికి వెళ్లేటప్పుడు ఒక లిస్టు రాసుకోండి. వాటిని మాత్రమే కొనుగోలు చేయండి. ఏదీ కూడా మిస్ చేయొద్దు. ఎక్స్ట్రా తీసుకోవద్దు.
  • బడ్జెట్ అనేది చాలా ముఖ్యం. ఏం కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకోవాలి. బడ్జెట్ ప్రకారం ఫాలో అవ్వాలి.
  • ఇంట్లోనే వంట చేసుకోవడం చాలా మంచిది. బయట భోజనాన్ని ఆర్డర్ చేసుకోకుండా ఇంట్లోనే వంట చేసుకుంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. సేవింగ్స్ చేయడానికి అవుతుంది.
  • ఆఫీస్ కి వెళ్లేటప్పుడు లంచ్ బాక్స్ తీసుకువెళ్ళండి. అక్కడ కొనుగోలు చేయడం వలన ఎక్కువ డబ్బులు అయిపోతాయి.
  • అలాగే షాపింగ్ కూడా స్మార్ట్ గా చేయాలి. వస్తువుల ధరలని కంపేర్ చేసుకోవాలి డిస్కౌంట్ ని చూసి కొనుగోలు చేయాలి.
  • మనం కట్టే బిల్లుల్ని కూడా తగ్గించుకుంటూ ఉండాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కచ్చితంగా లైట్స్, ఫ్యాన్స్ ఆఫ్ చేసేటట్టు చూసుకోవాలి.
  • ఓటీటీ వంటి వాటిని ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రిప్షన్స్ ని తగ్గించుకోవాలి. తక్కువగా ఉపయోగించే వాటిని సబ్స్క్రయిబ్ చేసుకోకండి.
  • మీ లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఇలా ఈ టిప్స్ ని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎక్కువగా ఆదా చేసుకోవడానికి అవుతుంది. తక్కువ ఖర్చు మాత్రమే అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version