రజినీకాంత్‌ లాల్‌సలామ్‌ ఆడియో లాంఛ్ ఎప్పుడంటే…?

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తాజాగా రూపొందుతున్న చిత్రం లాల్ సలాం.ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన టైటిల్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ చిత్రం వచ్చేనెల ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.విడుదల తేదీ సమీపిస్తుండడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ని ప్రారంభించింది .ఇందులో భాగంగా ఆడియో లాంచ్ ఈవెంట్ తేదీని మేకర్స్ ప్రకటించారు.ఈ ఈవెంట్ చెన్నైలోని శ్రీసాయిరామ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ టెక్నాలజీలో జనవరి 26న శుక్రవారం జరగనుంది. ఈ గ్రాండ్ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి స్టార్ సెలబ్రిటీస్ వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఉండబోతుంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.

ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్‌ నిర్మిస్తున్నారు. గతేడాది జైలర్ సినిమాతో రజనీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్టును సొంతం చేసుకున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news