కేఎల్ రాహల్ స్థానంలో వికెట్ కీపింగ్ చేయనున్న మరో ప్లేయర్…

-

ఈనెల 25న టీమిండియా ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ లో తల పడనుంది. ఇప్పటికే హైద‌రాబాద్ చేరుకున్న ఇండియా జ‌ట్టు ఉప్ప‌ల్ స్టేడియంలో నెట్స్‌లో ప్రాక్టీస్ వేగం పెంచింది. అయితే తొలి రెండు టెస్టుల్లో ఎవరిని వికెట్ కీపర్ గా ఎంపిక చేయాలని అంశం పైన హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ లో కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడానికి ద్రవిడ్ పేర్కొన్నారు. అతని స్థానంలో మరో ఇద్దరు ఆటగాళ్లను సెలెక్ట్ చేశామని తెలిపారు. ఈ టెస్ట్ సిరీస్ లో కేఎల్ రావు కేవలం బ్యాట్స్మెన్ గా ఆడతాడని వెల్లడించారు. దక్షిణాఫ్రికా తో జరిగిన టెస్ట్ సిరీస్లో వికెట్ కీపర్ గా రాణించడంతోపాటు అటు బ్యాట్స్మెన్ గా కూడా సత్తా చాటాడు.

అయితే మరో నాలుగు నెలలు టి20 ప్రపంచ కప్ మొదలుకానుంది .ఈ నేపథ్యంలో కేల్ రాహుల్ పైన ఒత్తిడి పడకుండా యాజమాన్యం చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగానే ఇంగ్లాండ్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ కి అతని స్థానంలో వేరే ప్లేయర్స్ కి వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించనున్నామని పేర్కొన్నారు. రాహుల్ కు బదులుగా సంజు సాంసన్ ,ధ్రువ్ జురెల్‌, శ్రీ‌క‌ర్ భ‌ర‌త్‌లలో ఎవరో ఒకరిని వికెట్ కీపర్ గా బీసీసీఐ ఎంపిక చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news