‘రాయన్’ నుంచి మరో పోస్టర్ రిలీజ్ ..మటన్ కొట్టు రాయన్ గా ధనుశ్ లుక్

-

కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా స్వీయ దర్శకత్వంతో తెరకెక్కుతున్న సినిమా ‘రాయన్’. తాజాగా ఈ మూవీ నుంచి మరో పోస్టర్ను మేకర్స్ విడుదల చేశారు. మటన్ కొట్టు రాయన్గా ధనుశ్ లుక్ ఆకట్టుకుంటోంది. పోస్టర్లో సందీప్ కిషన్తో పాటు కాళిదాస్ జయరాం కూడా ఉన్నారు. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

ఈ సినిమాలో దుసారా విజయన్, , ఎస్.జె.సూర్య, అపర్ణ బాలమురళి ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రం జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.నార్త్ చెన్నై కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news