సల్మాన్ ఇంటి బయట కాల్పులు మా పనే: అన్మోల్ బిష్ణోయ్

-

ఇవాళ ఉదయం బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడిన సంగతి తెలిసిందే.సల్మాన్ ఖాన్ ఇంటి బయట జరిగిన కాల్పులు తమ పనేనని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్ ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘సల్మాన్. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. మా బలమేంటో నీకు అర్థమై ఉంటుంది . దాన్ని పరీక్షించొద్దు. ఈసారి తుపాకీ పేలుడు ఇంటి బయటితో ఆగదు’ అని వార్నింగ్ ఇచ్చారు. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఉన్న అన్మోల్ ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు.

కాగా, ఘటన సమయంలో ఆయన ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. దుండగుల కాల్పుల్లో ఓ బుల్లెట్ మొదటి అంతస్తులోకి దూసుకెళ్లినట్లు సమాచారం. అదృష్టవశాత్తు తమ అభిమాన హీరోకు ఏమీ కాలేదని అభిమానులు పోస్టులు చేస్తున్నారు. కాగా గత ఏడాది సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు పెరిగిన నేపథ్యంలో ఆయనకు Yప్లస్ భద్రతను కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news