రికార్డు సృష్టించిన హనుమాన్ సినిమా

-

టాలెంటెడ్ అండ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన తాజా చిత్రం. హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది.

చిన్న సినిమాగా విడుదలై రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన హనుమాన్ సినిమా  మరో రికార్డు సాధించింది. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ను కోటి మందికి పైగా వీక్షించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. సౌత్ ఇండియా నుంచి బాహుబలి-2, కేజీఎఫ్-2, బాహుబలి, RRR, రోబో 2.0, ఇండియన్, యానిమల్ తదితర చిత్రాలు 3 కోట్లకు పైగా ఫుట్ఫాల్స్ను సాధించాయి. ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.

Read more RELATED
Recommended to you

Latest news