రూ.3వేల కోట్లతో వికారాబాద్‌ జిల్లాను అభివృద్ధి చేస్తాం : స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

-

వచ్చే ఐదు ఏళ్లలో వికారాబాద్ జిల్లాను 3000 కోట్ల నిధులతో అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కార్యక్రమంలో పాల్గొని చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాబోయే రోజులలో వికారాబాద్ జిల్లాకు అన్నలా ఉండి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తామని హామీ ఇచ్చాడు. దరఖాస్తు చేసుకున్నటువంటి అర్హత గల అభ్యర్థులందరికీ రేషన్ కార్డు జారీ చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల కు ముందు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీ పథకాలను రేషన్ కార్డు జారీ తర్వాత అమలు చేస్తామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ మంజుల రమేష్‌, వైస్‌ చైర్‌ పర్సన్‌ శంషాద్‌ బేగం,మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఎంపీపీ చంద్రకళ,వికారాబాద్‌ నియోజకవర్గ ఎంపీపీలు, వార్డు మెంబర్లు, సర్పంచులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version