Karthik Ghattamaneni : ఈగల్‌ రవితేజ మార్క్‌ సినిమా కాదంటున్న డైరెక్టర్ కార్తీక్‌….

-

కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మాస్ మహా రాజా రవితేజ హీరోగా నటిస్తున్నటువంటి తాజా చిత్రం ఈగల్. ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తుంది. కావ్య థాపర్ ,మధుబాల ,నవదీప్, అవసరాల శ్రీనివాస్ తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న వేల డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని చిట్ చాట్ సెషన్ లో పాల్గొన్నారు.

 

EAGLE Teaser out

ట్రైలర్లు చూపించినట్టు రవితేజ పాత్ర ఇందులో సీరియస్ గా ఉంటుంది. ఈ సినిమాలో రవితేజ మార్క్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ఉండదు. ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్.ఇప్పటికే మాస్ ఊచకోత.. చూశారు.. మీ ఎడ్రినలిన్ వేగాన్ని పెంచే ట్రైలర్‌ అంటూ లాంఛ్ చేసిన పోస్టర్‌ మూవీ పై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. విషం మింగుతాను.. విశ్వం తిరుగుతాను.. ఊపిరి ఊదుతాను.. కాపలా అవుతాను.. విధ్వంసం నేను.. విధ్వంసాన్ని ఆపే వినాశనం నేను.. అంటూ సాగే డైలాగ్స్‌ తో కట్ చేసిన ట్రైలర్‌.. సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌తో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version