Hardik pandya : కొత్త ఏడాదిలో అదిరిపోయే వీడియో షేర్ చేసిన హార్దిక్ పాండ్య‌.. దేనికి సంకేతం ఇది..!

-

నూతన సంవత్సరం సందర్భంగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించారు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో పాండ్య గాయపడిన సంగతి తెలిసిందే. దీంతో గాయం కారణంగా పాండ్య దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. అయితే అతడి ఫిట్నెస్ కి సంబంధించిన సమాచారాన్ని బీసీసీఐ ఇప్పటివరకు ప్రకటించలేదు. నూతన సంవత్సరం సందర్భంగా జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న వీడియోను పంచుకున్నాడు.జిమ్‌లో వెయిట్ ట్రైనింగ్, స్ట్రెచింగ్ వంటి వర్కౌట్స్ చేస్తున్న దృశ్యాలను చూడవచ్చు. దీంతో త్వరలోనే మైదానంలోకి అడుగు పెడతాననే పరోక్ష సంకేతాలు ఇచ్చాడు.

గాయం కార‌ణంగా ఆస్ట్రేలియా తో టీ20 సిరీస్‌, ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూరం అయినాడు. ఇక ఐపీఎల్ 2024 సీజ‌న్‌ తో పాటు జ‌న‌వ‌రి 11 నుంచి అఫ్గానిస్తాన్‌తో జ‌ర‌గ‌నున్న మూడు టీ20 మ్యాచుల సిరీస్‌ కి హార్థిక్ పాండ్యా దూరం అవుతాడ‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ వార్తలు అన్నింటికి చెక్ పెడుతూ హార్దిక్ వీడియోను షేర్ చేసినట్లు అర్థ‌మవుతోంది

 

ఐపీఎల్ వేలానికి ముందు ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ ద్వారా గుజ‌రాత్ టైటాన్స్ నుంచి హార్దిక్ పాండ్య‌ను దక్కించుకుంది. అయితే ముంబై జ‌ట్టుకు ఐదు సార్లు టైటిల్స్ అందించినటువంటి రోహిత్ శ‌ర్మ‌ను కెప్టెన్సీ నుంచి తొల‌గించి పాండ్య‌కు సారథ్య ప‌గ్గాలు అప్ప‌గించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version