రథసప్తమిరోజు చాలా ప్రాంతాలలో పొద్దున్నే రేగుపండ్లు, జిల్లేడు ఆకులతో స్నానం చేస్తారు. ఎందుకు అంటే.. జిల్లేడు, రేగు ఆకులకు సూర్యుని నుండి కాంతిని ఎక్కువగా గ్రహించే లక్షణం కలిగిఉంటాయి. వాటిని మన తలపై ఉంచుకొని స్నానం చెయటం వలన అవి గ్రహించిన సౌరశక్తి లోని కాస్మిక్ కిరణాలు మన శిరస్సు ద్వారా స్వీకరించే అవకాశం వుంది.ఆవు పేడ పిడకలతో మంట మండించటం, ఆవు పాలతో పాలు పొంగించటం అనేది సూక్ష్మక్రిమి రహితంగా చేయడానికి.
ఆవుపేడలో, పాలలో సూక్ష్మజీవి నాశకాలు వుంటాయన్నది శాస్త్రసమ్మతం. ఈ విధంగా ఆలోచిస్తే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన చాలా ఆచారాలు, పూజా పునస్కారాల వెనుక సైన్స్ ఉంది. దీనికి సంబంధించి ఆసక్తిదాయకమైన విశేషాలు మన పురాణాలలో అనేకం ఉన్నాయి. అసలు ప్రతిరోజూ సూర్యుని ముందు నిలబడి ఆదిత్య హృదయం చదవటం, సూర్య నమస్కారాలు చేయటం వల్ల, అనేక వ్యాధులు కూడా దూరమౌతాయని పురాణాలు చెబుతూనే వున్నాయి. కఫమూ, దగ్గూ, చర్మ రోగాల వంటివే కాక భయంకరమైన కుష్టు వ్యాధి కూడా మటుమయమౌతుందట! ఇలా రోగాలే కాక, శతృ బాధను కూడా నివారిస్తాడు.
-కేశవ