రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్

-

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది . ఐటీ అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కొడంగల్, హైదరాబాద్లోని రేవంత్ రెడ్డి ఇళ్లతో పాటు, బందువుల ఇళ్లల్లో ఏకకాలంలో 15 చోట్ల సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కొడంగల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్‌రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని తన నివాసానికి రావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. దీంతో కొడంగల్‌ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం ముగించుకుని కొద్దిసేపటి క్రితమే రేవంత్‌రెడ్డి తన నివాసానికి చేరుకున్నారు. రేవంత్‌ వస్తున్న విషయం తెలుసుకున్న కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా అక్కడికి చేరుకుని  సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఐటీ అధికారులను కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది.

2009, 2004లో ఎన్నికల అఫిడవిట్ లో పొందుపర్చిన వివరాలు, వాస్తవ ఆస్తులు సరిగా లేవని అధికారులు ఆరోపిస్తున్నారు. వీటితో పాటు రేవంత్ రెడ్డిపై ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002, బ్లాక్ మనీ ఇన్ కం ట్యాక్స్ యాక్ట్ 2015,ప్రొహిబిషన్ ఆఫ్ బినామి ట్రాన్సాక్షన్స్ యాక్ట్ 1988లతో పాటు ఫెమా, మనీలాండరింగ్ చట్టాలను ఉల్లంఘించినట్లు అధికారులు పేర్కొన్నారు. హవాలా మార్గంలో కోట్లాది సొమ్మును కూడబెట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. 2014 ఫిబ్రవరి 5న ఒకే రోజు రూ.9కోట్ల రూపాయలు రేవంత్ అకౌంట్లోకి రావండంపై ఐటీ అధికారులు ప్రధానంగా విచారిస్తున్నారు.

రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆయన ఇంటికి చేరుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఇంటిని చుట్టుముట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version