పతంజలి వస్తువులు తెలియని వాళ్లు ఉండరు. దేశీయ, సహజ సిద్ధమైన ఉత్పత్తులంటూ మార్కెట్ లోకి వచ్చిన బాబా రామ్ దేవ్ కు చెందిన పతంజలి సంస్థ ప్రస్తుతం ఎంతో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. తర్వాత టెలికాం రంగంలోకి కూడా వస్తున్నట్లు ఆమధ్య రామ్ దేవ్ బాబా ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికోసం బీఎస్ఎన్ఎల్ తో పతంజలి సంస్థ జతకట్టింది. స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను కూడా విడుదల చేశారు. డెయిరీ వ్యాపారంలోకి కూడా దిగారు. తాజాగా.. పతంజలి పరిధాన్ పేరుతో వస్త్ర వ్యాపారంలోకి పతంజలి సంస్థ ప్రవేశించనుంది. పతంజలి పరిధాన్ పేరుతో ఎక్స్ క్లూజివ్ బ్రాండ్ ఔట్ లెట్లను కూడా ప్రారంభించనున్నారు. త్వరలోనే పతంజలి డ్రెస్సులు కూడా రానున్నాయన్నమాట.