420 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను వంచించింది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఎండిపోయిన పోలాలను చూపిస్తూ రైతులు బాధపడుతున్నారు. ఎండిన పంటపొలాలను చూస్తుంటే కన్నీళ్లు వచ్చే పరిస్థితి ఉంది. కేసీఆర్ పై అక్కసుతో మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగించడం లేదు. రైతులను నీళ్లించే తెలివి లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. రాజకీయ కక్షను పక్కనపెట్టి సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం నీళ్లను విడుదల చేయాలి. ఆడపిల్లలకు స్కూటీలు, మహిళలకు 2500 ఏమయ్యాయి.. మహిళలను చిన్నచూపు చూస్తున్న రేవంత్ రెడ్డికి కాలం గుణపాఠం చెబుతుంది అని అన్నారు.
ఇక రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారు.. తగిన సమయంలో బుద్దిచెబుతారు. అర్హులకు వెంటనే ఇళ్లు ఇవ్వాలి. రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదు. రుణ మాఫీ ఎక్కడా కూడా సంపూర్ణంగా కాలేదు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారు. అయినా కూడా మనోధైర్యంతో కార్యకర్తలు చెక్కుచెదరలేదు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అని ఎమ్మెల్సీ కవిత అన్నారు.