ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన వెలుముల నందిని (22) అనే బీటెక్ విద్యార్థిని, ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ప్రేమ పెళ్ళికి అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నా, అమ్మాయి తల్లితండ్రులు ఒప్పుకోకపోవడంతోనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అని ఆరోపిస్తున్నారు స్థానికులు. అయితే.. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… దర్యాప్తు చేస్తున్నారు.