అమెరికాలో రోడ్డు ప్రమాదం జరిగి.. ఏకంగా ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు దుర్మరణం చెందారు. మృతులు రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లికి చెందిన ప్రగతి రెడ్డి (35), ఆమె కుమారుడు హార్వీన్ (6), అత్త సునీత (56) గా గుర్తించారు.
ఇక అమెరికాలోని ఫ్లోరిడాలో ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతదేహాలను ఇండియాకు పంపిస్తున్నారు. ఇక ఈ సంఘటన నేపథ్యం లో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం టేకులపల్లిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.