రాష్ట్రముని అభివృద్ధి చేయాలంటే విజన్ కలిగిన నాయకుడు కావాలని ఆ విజన్ చంద్రబాబు గారికి ఉందని మాజీ మంత్రి నారాయణ అన్నారు. బాబు షూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం గురించి చర్చించారు.అలాగే ఓటర్ల వెరిఫికేషన్ చేయించి దొంగ ఓట్లను తొలగించాలని సూచించాడు. వచ్చే ఏడాది ఎన్నికల గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సిద్ధంగా ఉండాలని చెప్పాడు. ఈరోజు నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలోని క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలతో ఆయన మాట్లాడారు.
ఈ కార్యక్రమానికి నెల్లూరు టిడిపి అధ్యక్షుడు మరియు రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శితో కలిసి బాబు సూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ అనే కార్యక్రమం పురోగతిపై మంతనాలు జరిపాడు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిత్యం ప్రజలలో ఉంటూ ప్రతి కార్యకర్త నిత్యం టిడిపి యొక్క పథకాల గురించి చెబుతూ ఉండాలని అన్నాడు. అలాగే క్షేత్రస్థాయిలో గతంలో టిడిపి పార్టీ ప్రవేశపెట్టిన పలు పథకాల గురించి ప్రజలకు వివరించాలని కోరారు. రానున్న ఎన్నికల్లో టిడిపి విజయం సాధించేలా పార్టీ శ్రేణులు అందరూ కలిసి కృషి చేయాలని కోటంరెడ్డి శ్రీనివాసులు సూచించారు.