NIA : కర్ణాటకలో భారీ ఉగ్ర కుట్ర… భగ్నం చేసిన ఎన్ఐఏ

-

ఈరోజు ఐసిస్ తో సంబంధాలు ఉన్న ప్రాంతాలపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాడులు చేసింది. కర్ణాటక ,మహారాష్ట్ర ,ఢిల్లీ ,ఝార్ఖండ్ రాష్ట్రాలలో మొత్తం 19 ప్రదేశాలలో సోదాలు చేసింది. ఈ దాడిలో మొత్తం ఎనిమిది మంది ఐసిస్ ఏజెంట్స్ ని అదుపులోకి తీసుకున్నాయి. వీరు ఉగ్రవాదానికి సంబంధించిన చర్యలు మరియు కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నది. వీరు బళ్లారి ప్రాంతానికి చెందినవారు. వారి వద్ద నుండి మారణ ఆయుధాలు, పేలుడు పదార్థాలు మరియు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుంది. ఉగ్ర ముఠాకి ప్రధాన సూత్రధారిగా ఉన్న md సులేమాన్ ను అరెస్టు చేసింది.

ఐసిస్ కి సంబంధించిన ఉగ్ర ముఠాలను పట్టుకోవడానికి ఎన్ఐఏ 24 గంటలు పని చేస్తుంది. ఇన్స్టంట్ మెసేజ్ యాప్ ని ఉపయోగించి నిందితులు ఒకరికొకరు సందేశాలు పంపుకుంటున్నారని తెలిపింది. కళాశాల విద్యార్థులను కూడా ఇటువంటి చర్యలలో పాల్గొనేటట్లు ప్రేరేపిస్తున్నారని తెలిపింది. ఇదిలా ఉండగా… గతంలో మహారాష్ట్రలో సోదాలు నిర్వహించి 15 మంది అనుమానితులను అరెస్టు చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news