తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు రాములమ్మ సై అంటోంది కాంగ్రెస్. 2014లో తెరాసను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన విజయశాంతికి స్టార్ క్యాంపెయినర్‌గా… తెలంగాణ ప్రదేశ్ ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారు బాధ్యతల్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అప్పగించారు. కాంగ్రెస్ 53 మందితో కో ఆర్డినేషన్ కమిటీ.. 15 మందితో కోర్ కమిటీ.. 41 మందితో ఎన్నికల కమిటీలు కలిపి మొత్తం 9 కీలక కమిటీలను ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ పబ్లిసిటీ కమిటీ కమిటీకి చైర్మన్‌గా కోమటిరెడ్డి వెంకట రెడ్డి నియమితులయ్యారు.
2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. అయితే ముందస్తు ఎన్నికల హడావుడి మొదలు కావడంతో ఆమె మళ్లీ యాక్టివ్ అయ్యారు. ఇటీవల మహాకూటమి కాంగ్రెస్ కి అవసరం లేదు.. ఒంటరిగానే ఎన్నికల్లో గెలిచే సత్తా కాంగ్రెస్ కి ఉందని వెల్లడించి.. రాములమ్మ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.