విడుదలకి సిద్దమవుతున్న రాజ్ తరుణ్ ‘పురుషోత్తముడు’ మూవీ ….

-

ఇటీవల నాగార్జున ‘నా సామిరంగ’ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ ఒక ముఖ్య పాత్ర చేసి ప్రేక్షకులని అలరించారు. ఇప్పుడు సోలో హీరోగా రామ్ భీమన దర్శకత్వంలో‘పురుషోత్తముడు’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొత్త అమ్మాయి హాసిని సుధీర్ కథానాయికగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదల అవడానికి సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. తాజాగా చిత్ర బృందం డబ్బింగ్ పనులు షురూ చేసింది.ఇక త్వరలోనే ఈ చిత్రం విడుదల డేట్ ని కూడా ప్రకటిస్తామంటూ మూవీ టీం ప్రకటించారు. శ్రీ శ్రీదేవి ప్రోడుక్షన్స్ బేనర్ పై ప్రకాష్ తేజావత్ ,డా.రమేశ్ తేజావత్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం,మురళి శర్మ, బ్రహ్మాజీ, రాజా రవీంద్ర, సత్య, ముకేష్ ఖన్నా తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. . ఇప్పటికే ఈ చిత్రం నుంచి కొన్ని రిలీజ్ అయినటువంటి సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని మేకర్స్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news