ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు.
ఇదిలా ఉండగా…శ్రీరాముడు అందరివాడని, కొందరి వాడు అన్నట్లుగా బీజేపీ ప్రచారం చేయడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పవిత్ర కార్యాన్ని రాజకీయాలకు వాడుకోవడం మంచి పద్ధతి కాదనీ,రాముడి గుడి పేరుతో బీజేపీ రాజకీయం చేయడం ఆపాలని ఆయన సూచించారు. అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ చేయడము ఏంటని ప్రశ్నించారు.రామాలయంప్రాణప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోడీ చేయడాన్ని పీఠాధిపతులే వ్యతిరేకించారని గుర్తు చేశారు. రాములవారి అక్షింతల పేరుతో బియ్యం సంచులు ఇస్తున్నారని , మళ్లీ గెలుస్తామో..తిరుగుబాటు వస్తుందో కాలమే నిర్ణయిస్తుందన్నారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని దానికి వ్యతిరేకంగా కోర్టులో ఫిల్ దాఖలు చేయడం సరికాదన్నారు.