స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేేసేందుకు 4 వారాల గడువు కావాలని చంద్రబాబు తరపు న్యాయవాది హరీశ్ సాల్వే కోరారు. ఫిబ్రవరి 09వ తేదీకి విచారణ వాయిదా వేయాలని అభ్యర్థించారు. ఫిబ్రవరి 09న తనకు మరో పని ఉందని ఏపీ ప్రభుత్వ న్యాయవాది రంజిత్ కుమార్ కోర్టుకు తెలిపారు. ఫిబ్రవరి 12కి వాయిదా వేయాలని హరీశ్ సాల్వే విజ్ఞప్తి చేయడంతో ధర్మాసనం అంగీకరించింది.
మరోవైపు చంద్రబాబుకి శిక్ష పడటం ఖాయమని పలువురు మంత్రులు పేర్కొంటున్నారు. ఎన్నిసార్లు వాయిదాలు వేసినా.. బెయిల్ మంజూరు చేసినా చివరికీ చంద్రబాబు జైలుకు వెళ్తారని చెబుతుండటం గమనార్హం. చంద్రబాబు కేసులో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో వేచి చూడాలి మరీ.