షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్: మంత్రి రోజా

-

AP: వైఎస్ షర్మిల పై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నాన్ లోకల్ పొలిటీషియన్ అని మంత్రి రోజా విమర్శించారు. ‘షర్మిల మాటలను ఎవరూ నమ్మేందుకు సిద్ధంగా లేరు. రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ తీరని అన్యాయం చేసింది. వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్ లో చేర్చి ఆ పార్టీ అవమానించింది. అలాంటి పార్టీకి రాష్ట్రంలో ఓటు అడిగే అర్హత లేదు. కాంగ్రెస్లోకి ఎవరు వచ్చినా జీరోలే అవుతారు. షర్మిల కూడా జీరోనే’ అని ఆమె మండిపడ్డారు.

అయితే ఈరోజు గుంటూరులో పర్యటించిన వైఎస్ షర్మిల ఏపీలోని ముఖ్య రాజకీయ పార్టీలైన బిజెపి ,జనసేన వైఎస్ఆర్సిపి ,తెలుగుదేశం పార్టీలపైన సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తన సోదరుడు వైయస్ జగన్ పైన తీవ్ర విమర్శలు వైఎస్ జగన్ ప్రభుత్వం గుంటూరునీ , గుంటలూరుగా మార్చారు. గుంటలూరు మళ్లీ గుంటూరు కావాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ కి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది’ అని షర్మిల హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news