షర్మిల వల్ల వైసీపీకి నష్టం లేదు, ఇది చంద్రబాబు కుట్రే- సజ్జల సంచలన వ్యాఖ్యలు

-

వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరికపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. షర్మిల కాంగ్రెస్ లో చేరటం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని ఆయన సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ షర్మిల రాజకీయంగా ఎక్కడ నుంచైనా ప్రాతినిధ్యం వహించవచ్చని అన్నారు. అయితే, షర్మిల వల్ల వైసీపీకి వచ్చే నష్టం ఏమీ ఉండదని తెలిపారు. ఏపీ లో కాంగ్రెస్ పార్టీకి భవితవ్యం లేదని, అలాంటి పార్టీని మేము పట్టించుకోము అని సజ్జల అన్నారు.

అంగన్ వాడీల సమ్మెపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడంపైనా సజ్జల స్పందించారు. ఎస్మా ప్రయోగం సమంజసమే అని అన్నారు ఆయన. అంగన్ వాడీల్లో గర్భిణీలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. అత్యవసర సర్వీసుల కింద ఉన్న అంగన్ వాడీలు గర్భిణీలు, చిన్నపిల్లలు ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత వారి పైన ఉందని అన్నారు. వారు తిరిగి విధుల్లో చేరాలని అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ అంగన్వాడీలు ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించారని, అందుకే ఎస్మా చట్టాన్ని ప్రయోగించామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version