సస్పెన్స్: కర్ణాటక సీఎం విషయంలో మతలబు… అధిష్టానం ఎటువైపు !

-

కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యి నేటికి మూడు రోజులు గడిచాయి. ఈ ఎన్నికలలో ప్రజల ఆగ్రహానికి గురైన బీజేపీ దారుణంగా పరాజయం పాలయింది. కాగా కాంగ్రెస్ మాత్రమే భారీ మెజారిటీతో గెలిచి ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అయితే ఇప్పుడు కర్ణాటకకు కానున్న సీఎం ఎవరు అన్న విషయం ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం బాధాకరం అని చెప్పాలి. మాములుగా అయితే చాల చోట్ల సీఎం అభ్యర్థి ఎవరనే విషయం ఖరారు చేసుకునే ఎన్నికలకు వెళుతారు, కానీ ఇక్కడ మాత్రమే సీఎం కుర్చీ కోసం ఒక సీనియర్ నాయకుడు మరియు దూకుడుగా వ్యవహరించే ఒక నాయకుడు పోటీ పడుతున్నారు. నిన్న మాజీ సీఎం మరియు సీనియర్ నాయకుడు సిద్దరామయ్య ఢిల్లీ వెళ్లి అగ్ర నేతలతో సమావేశం అయ్యారు, మరి ఏమి చర్చ జరిగిందన్నది తెలియాల్సి ఉంది.

కాగా ఈ రోజు డీకే శివకుమార్ ఢిల్లీ వెళ్లారు. ప్రస్తుతం జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే , వేణుగోపాల్ లాంటి వారు ఘాడంగా చర్చిస్తున్నారు. మరి ఈ రోజు సాయంత్రానికి కర్ణాటక సీఎం ఎవరు కానున్నారు అన్నది తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం సిద్దరామయ్య వైపే మొగ్గు చూపే చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news