సైబర్ అలర్ట్…. అయోధ్య ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు అంటూ మోసం

-

రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కళ్లారా చూడాలని ఎదురుచూస్తున్నారు.ఈ మహత్తర ఘట్టం జనవరి 22వ తేదీన జరగనుంది. అయితే ఇదే అదునుగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. అయోధ్య రామాలయం ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అంటూ జనాలకు మాయమాటలు చెప్పి బ్యాంక్‌ అకౌంట్లు ఖాళీ చేసేస్తున్నారు.

సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ లలో జనవరి 22న జరిగే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి వీఐపీ టికెట్లు కావాలా? అయితే ఈ లింక్‌ను క్లిక్‌ చేయండి …..అంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. మరికొందరు సైబర్‌ నేరగాళ్లు ఏపీకే ఫైల్‌ పంపించి.. ఈ అప్లికేషన్ ను ఇన్‌స్టాల్‌ చేసుకుంటే డైరెక్ట్‌గా వీఐపీ యాక్సెస్‌ దొరుకుతుంది అంటూ వాట్సాప్‌ల్లో సందేశాలు ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఇలాంటి మెసేజ్‌ల్లోని లింక్‌లను క్లిక్‌ చేసినా.. ఏపీకే ఫైల్స్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకంటే మీ పర్సనల్‌, బ్యాంక్‌ డేటా మొత్తం స్కామర్ల చేతిలోకి వెళ్లే అవకాశం ఉంది. అయోధ్య రామ మందిరం పేరుతో జరుగుతున్న ఈ మోసాలపై జనాలను అప్రమత్తం చేస్తూ ఇలాంటి మెసేజ్‌ల్లో వచ్చిన లింక్‌లు ఓపెన్‌ చేయవద్దని.. ఏపీకే ఫైల్స్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సూచించారు. అలా చేస్తే మీ డేటాను సైబర్‌ నేరగాళ్లు దోచుకుని మోసాలకు పాల్పడతారని ఆయన హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Latest news