సోనూసూద్‌కు ఈ సారి కూడా పద్మా పురస్కారము రాలేదని నెటిజన్లు తీవ్ర అసంతృప్తి…

-

గణతంత్ర దినోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం కేంద్ర ప్రభుత్వం 132 పద్మ అవార్డులను ప్రకటించింది.ఇందులో ఐదుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మభూషణ్‌, 110 మందిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. అయితే ఈ సారి కూడా ప్రముఖ నటుడు సోనూసూద్‌కు పద్మా పురస్కారాలు రాలేదు. దీంతో సోషల్ మీడియా వేదిక కొంతమంది ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

దేశావ్యాప్తంగా కరోనా సమయంలో సోనూసూద్ చేసిన అనేక సహాయాలు, చారిటీ గురించి నెటిజన్లు గుర్తు చేసుకున్నారు. కరోనా సమయంలో నెల్లూరు జిల్లాలో ఆక్సిజన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని స్వయంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు సోనూసూద్ కు లేఖ రాశారు అని గుర్తు చేసుకున్నారు. ఇప్పటికి సహాయాలు చేస్తున్న సోనూసూద్ లాంటి వాళ్ళు అవార్డులకి అనర్హులా..? అని చర్చానీయాంశంగా మారింది.సోనూసూద్ కు అవార్డు రావడానికి అతను బీజేపీ సపోర్టర్ కాదని కేంద్రాన్ని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఈ ‘పద్మ’ పురస్కారాలు రాను రాను విలువలు ఉండవేమో ? అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు సోనూసూద్ కు భారతదేశ ప్రజలు వెయ్యి భారతరత్నల కంటే గొప్ప సర్టిఫికెట్ మొత్తం ఎప్పుడో ఇచ్చేశారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version