సౌత్ ఆఫ్రికా ముందు భారీ లక్ష్యం … కనీసం 300 అయినా చేస్తుందా ?

-

ఆస్ట్రేలియా మరియు సౌత్ ఆఫ్రికా మధ్యన జరుగుతూ రెండవ వన్ డే లో కంగారూలు పరుగుల జాతర చేసుకుంటున్నారు. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్ లలో 8 వికెట్ల నష్టానికి 392 పరుగులు చేసింది. ముందుగా ట్రవిస్ హెడ్ సౌత్ ఆఫ్రికా బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. అనంతరం ఈ బాధ్యతను వార్నర్ (106) మరియు లబుచెన్ (124) లు తీసుకున్నారు. ఇద్దరూ సెంచరీ లతో కధం తొక్కి ఆస్ట్రేలియా కు భారీ స్కోరు అందించారు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలర్లు మొదట భారీగా పరుగులు సమర్పించుకున్నా ఆ తర్వాత ఆస్ట్రేలియా ఆటగాళ్లను బాగా కట్టడి చేశారు. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో శంసి 4 మరియు రబడా 2 వికెట్లు తీసుకున్నారు.

మొదటి వన్ డే లో 222 పరుగులకు పరిమితం అయిన సౌత్ ఆఫ్రికా, ఈ మ్యాచ్ లో ఇంత భారీ స్కోర్ ను చేదిస్తుందా ? కనీసం 300 పరుగుల మార్కును అయినా దాటుతుందా తెలియాలంటే కాసేపు వరకు ఆగాల్సిందే..

Read more RELATED
Recommended to you

Exit mobile version