సినీ నిర్మాత, కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేశ్ బీఆర్ఎస్పైనా, ముఖ్యంగా మాజీ మంత్రి హరీశ్రావుపైన చేసిన విమర్శలను ఎఫ్డీసీ మాజీ చైర్మన్ అనిల్ కూర్మాచాలం తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో సంబంధంలేని బండ్ల గణేష్ తన స్థాయిని మరిచి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన బీఆర్ఎస్ పార్టీ పైనా, ఎమ్మెల్యే లు హరీష్ రావు ,కేటీఆర్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం సరి కాదన్నారు.
బండ్ల గణేశ్ నోరు అదుపులోపెట్టుకోవాలని ,పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దవాన్ని అవుతాననే భ్రమలో, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ అధినాయకత్వం మెప్పు కోసం పదవులకు ఆశపడి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు.ఇలాంటి తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తే రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ది చెబుతారని అన్నారు. బండ్ల గణేష్ తన స్థాయి తెలుసుకుని ప్రవర్తించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇలాంటి వాటిని, వీరు చేస్తున్న విమర్శలను సహించరని రానున్న రోజుల్లో వీరిని ప్రోత్సహిస్తున్న వారికి, వారి పార్టీకి తగిన బుద్ది చెబుతారని అనిల్ కూర్మాచలం స్పష్టం చేశారు.