స్పిన్నర్ అశ్విన్‌కు రామ్‌ ల‌ల్లా ‘ప్రాణ ప్ర‌తిష్ట’ ఆహ్వానం….

-

Ravichandran Ashwin : ఈనెల 22న అయోధ్యలో జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి  దేశ ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. అంతేకాకుండా దేశ విదేశాల నుండి ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు కూడా హాజరుకాబోతున్నారు. రాము మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి టీమిండియా ఆటగాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్‌కు  ఆహ్వానం అందింది. త‌మిళనాడు బీజేపీ స్టేట్ సెక్ర‌ట‌రీ, వైస్ ప్రెసిడెంట్‌లు చెన్నైలోని అశ్విన్ నివాసానికి వెళ్లి ఆహ్వానాన్ని అందించారు . రామమందిరం ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ అందుకున్న నాలుగో భారత క్రికెటర్ అశ్విన్.

అశ్విన్ కంటే ముందు స‌చిన్ , మ‌హేంద్ర సింగ్ ధోనీ, కోహ్లీలకు ఆహ్వాన ప‌త్రిక  అందింది.అయితే.. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపికైన ఇండియా బృందంలోని మిగ‌తా స‌భ్యులు రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజ‌రవుతారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియంలో జ‌న‌వ‌రి 25న తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రాక్టీస్ కోసం టీమిండియా క్రికెటర్స్ జ‌న‌వ‌రి 20న ఉప్ప‌ల్ చేరుకోవాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news