తెలంగాణ బిజెపికి కొత్త కోచ్.. ఆయన డైరెక్షన్ లోనే ఎన్నికలకు..

-

ఆటలో అయినా వేటలోనైనా కోచ్ పాత్ర చాలా కీలకం.. ఆయన డైరెక్షన్లో వెళితేనే విజయం సాధ్యమవుతుంది.. ఇదే సిద్ధాంతాన్ని తెలంగాణలో బిజెపి ఫాలో అవుతుంది.. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి నేతలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.. అందులో భాగంగా తెలంగాణ బిజెపి నేతలకు డైరెక్షన్స్ సూచనలు సలహాలు ఇచ్చేందుకు పార్టీ అధిష్టానం తెలంగాణ బిజెపి సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా చంద్రశేఖర్ ను నియమించింది.. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన సీట్లు సాధించకపోవడంతో.. ఈసారి పార్లమెంట్ ఎన్నికలపై బిజెపి అగ్రనాయకత్వం దృష్టి పెట్టింది..

BJP-party

తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికలను బిజెపి అగ్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.. మెజారిటీ ఎంపీ స్థానాలను గెలవాలని లక్ష్యంతో ఉన్న ఆ పార్టీ.. సంస్థాగత కార్యదర్శిగా చంద్రశేఖర్ ను నియమించింది.. ఆయన నియామకం వెనుక బిజెపి పెద్ద ప్లానే వేసిందని పార్టీలో చేర్చి నడుస్తుంది.. గత ఎన్నికల్లో జరిగిన తప్పులను పునరావృతం చేయకుండా అలాగే పార్టీని ఏక తాటిపై తీసుకొచ్చేందుకు చంద్రశేఖర్ సమర్ధుడని పార్టీ భావిస్తుంది.. సంస్థాగత కార్యదర్శి అంటే పార్టీలో కీలక పదవి.. ఆయన తీసుకునే నిర్ణయాలే ఫైనల్ గా ఉంటాయని..

ఆయనకు ఎదురు చెప్పే సాహసం కూడా పార్టీలో ఏ ఒక్క సీనియర్ చేయలేరని తెలంగాణ బిజెపి నేతలు చర్చించుకుంటున్నారు.. ఆయన డైరెక్షన్లో పనిచేసి పార్లమెంట్లో అత్యధిక స్థానాలను గెలవాలని ఢిల్లీ అగ్ర నాయకత్వం భావిస్తుందట.. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బిజెపి గెలవడానికి చంద్రశేఖర్ కీ రోల్ ప్లే చేశారని పార్టీ నేతలు చెబుతున్నారు.. కనీసం 10 స్థానాలలో బిజెపి అభ్యర్థులు గెలుపొందేందుకు కోచ్ గా ఉన్న చంద్రశేఖర్ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని.. ఆయన డైరెక్షన్లో పనిచేస్తే తెలంగాణలో కమలం వికసించడం ఖాయమని సొంత పార్టీ నేతలు చెబుతున్నారు.. ఇంతకీ చంద్రశేఖర్ రాజకీయ చతురత తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలలో ఎలా ఫలిస్తుందో చూడాలి మరి…

Read more RELATED
Recommended to you

Latest news