అయోధ్య భూమి పూజ‌.. 1.25 ల‌క్ష‌ల ల‌డ్డూలు పంపిణీ..!

-

రేపు అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమి పూజ జ‌ర‌గ‌నున్న సంద‌ర్భంగా అయోధ్య‌తోపాటు బీహార్‌లోని ప‌లు ప్రాంతాల్లో మొత్తం 1.25 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను పంపిణీ చేయ‌నున్నారు. ఈ మేర‌కు పాట్నాకు చెందిన మ‌హావీర్ మందిర్ ట్ర‌స్టు ల‌డ్డూల‌ను పంపిణీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. మొత్తం 1.25 ల‌క్ష‌ల ల‌డ్డూల్లో 51వేల ల‌డ్డూను రామ జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టుకు ఇస్తారు. ఆల‌య భూమి పూజ సంద‌ర్భంగా తీర్థ క్షేత్ర ట‌స్టు వారు ఆ ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు పంచుతారు. రఘుప‌తి ల‌డ్డూల పేరిట ఆ ల‌డ్డూల‌ను పంపిణీ చేయ‌నున్నారు.

ఇక రూ.1.25 ల‌క్ష‌ల్లో 51వేల ల‌డ్డూలు పోగా మిగిలిన వాటిని బీహార్‌లోని జాన‌కి పుట్టిన చోటు వ‌ద్ద‌, మ‌రో 25 ఆధ్యాత్మిక కేంద్రాల్లో పంచుతారు. అలాగే కొన్ని ల‌డ్డూల‌ను బీహార్‌లో రాముడు, హ‌నుమంతుడి భ‌క్తుల‌కు పంచుతారు. కాగా మ‌హావీర్ మందిర్ ట్ర‌స్టు ఇప్ప‌టికే రూ.2 కోట్ల‌ను రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర ట్ర‌స్టుకు విరాళంగా అంద‌జేసింది.

 

మ‌హావీర్ ట్ర‌స్టు రామ మందిరం నిర్మాణం కోసం రూ.10 కోట్ల‌ను విరాళంగా ప్ర‌క‌టించ‌గా.. అందులో రూ.2 కోట్ల‌ను ఇప్ప‌టికే ఇచ్చేసింది. దానికితోడు భూమి పూజ సంద‌ర్భంగా 1.25 ల‌క్ష‌ల ల‌డ్డూల‌ను పంచుతారు. ఆల‌య నిర్మాణం జ‌రిగేట‌ప్పుడు మరిన్ని విరాళాలు అంద‌జేస్తారు. కాగా మ‌హావీర్ ట్ర‌స్టీ ఆచార్య కిషోర్ కునాల్ మోదీతోపాటు భూమిపూజ‌లో పాల్గొంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version