బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా ఇటీవలే.. ఫోర్ట్ గ్రఫీ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఒక దాని వెనుక మరోటి శిల్పా శేట్టి దంపతులపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇక తాజాగా శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రా కు మరో షాక్ తగిలింది. రూ. 1.51 కోట్ల చీటింగ్ కేసులో నిందితులుగా ఉన్నారన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ముంబై, బాంద్రా పోలీస్ స్టేషన్ లో పూణె యువకుడు యష్ బరాయ్… శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా దంపతులు తనను మోసం చేశారంటూ.. కేసు నమోదు చేశారు. ఫ్యాషన్ టీవీ ఎండీ కషీఫ్ ఖాన్ పై ఈ మేరకు పలు సెక్షన్ల కింద ఎఫ్ ఐఆర్ నమోదు కావడం గమనార్హం. ఈ సంఘటన జూలై 2014 లో చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే.. తాజాగా దీనిపై శిల్పా శెట్టి, రాజ్‌కుంద్రా దంపతులపై కేసు నమోదు చేశాడు బాధితుడు యష్ బరాయ్. ఈ కేసు వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.