
ఆలయంలో త్రాచు పాము, వణికిపోయిన భక్తులు.. కొందరు నాగు రూపంలో వచ్చిన కార్తికేయ స్వామని పులకరిస్తుంటే మరికొందరు భయంతో గజగజలాడారు ఈ సంధర్భం తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని ఓ ఆలయంలో చోటు చేసుకుంది. గణపేశ్వరాలయంలోని గర్భగుడిలోకి అర్చకుడు వెళ్ళగా 10 అడుగుల పెద్ద త్రాచు పాము కనపడింది. గర్భగుడిలో పదడుగుల పాముని చూడటంతో భక్తులు అర్చకుడు వణికిపోయారు. కొంత సమయానికి ఆ పాము కనిపించలేదు, పాము వెళ్లిపోయింది అనుకునే లోపే శివ లింగం వెనుక ప్రాంతానికి వెళ్ళి అక్కడే పడుకుంది. ఇక పాములు ప్పట్టేవాడికి ఈ విషయాన్ని తెలియజేయగా పాములు పట్టడంలో ఆరితేరిన రిక్షా కార్మికుడు రాజయ్య ఆలయానికి చేరుకుని పామును ఒడిసి పట్టుకున్నాడు. అనంతరం దానిని ఆలయానికి దూరంగా వదిలిపెట్టారు. ఈ పామును జెర్రిపోతు అంటారని, ఇది ఎవరికీ హాని తలపెట్టదని ఆయన తెలిపారు.