మనం మన దేశంలో ఉన్నంత వరకు.. మనకు ఇక్కడి నిబంధనలు, నియమాలు, చట్టాలు.. అన్నీ తెలుసు కాబట్టి వాటికి అనుగుణంగా నడుచుకుంటాం. అయితే విదేశాలకు వెళ్లినప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది.
మనం మన దేశంలో ఉన్నంత వరకు.. మనకు ఇక్కడి నిబంధనలు, నియమాలు, చట్టాలు.. అన్నీ తెలుసు కాబట్టి వాటికి అనుగుణంగా నడుచుకుంటాం. అయితే విదేశాలకు వెళ్లినప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. ఎందుకంటే.. ఆయా దేశాల్లో ఉండే నియమాలు, చట్టాల గురించి సరిగ్గా తెలియదు కదా. అందుకనే కొన్ని సార్లు కొందరు పొరపాట్లు చేస్తుంటారు. ఆ తరువాత అనవసరంగా ఫైన్ కట్టడమో లేదా జైలు శిక్ష అనుభవించడమో జరుగుతుంటుంది. అయితే ఆ రూల్స్ గురించి ముందుగానే తెలుసుకుంటే మనం జాగ్రత్త పడవచ్చు. ఈ క్రమంలోనే సింగపూర్ దేశానికి వెళ్లేవారు అక్కడి రూల్స్ గురించి ముందుగానే తెలుసుకుంటే మంచిది కదా.. మరి ఆ రూల్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!
1. సింగపూర్‌లో చూయింగ్ గమ్ అమ్మడం, కొనడం చట్టరీత్యా నేరం. ఇక ఆ చూయింగ్ గమ్‌ను నమిలి ఊస్తే అందుకు అక్కడ రూ.23వేల వరకు ఫైన్ వేస్తారు. అయితే వైద్యులు సూచిస్తే వారి ప్రిస్క్రిప్షన్ దగ్గర ఉంచుకుని ఎవరైనా చూయింగ్ గమ్ నమలవచ్చు. 2004 నుంచి ఈ నిబంధనను అక్కడ అమలు చేస్తున్నారు.
2. సింగపూర్‌లో పబ్లిక్ టాయిలెట్స్‌లోకి వెళ్లి ఉపయోగించుకున్నాక కచ్చితంగా టాయిలెట్ ఫ్లష్ చేయాలి. లేకపోతే రూ.7వేల వరకు జరిమానా విధిస్తారు.
3. మన దేశంలోలాగే సింగపూర్‌లోనూ పోర్న్ చిత్రాలపై నిషేధం ఉంది. అక్కడ వాటిని చూడడం నేరం. అలాగే వీధుల్లో నగ్నంగా తిరగడం కూడా నేరమే. అలా చేస్తే 2వేల డాలర్ల ఫైన్, 3 నెలల జైలు శిక్ష విధిస్తారు.
4. సింగపూర్‌లో వీధుల్లో చెత్త వేస్తే రూ.46వేల వరకు ఫైన్ విధిస్తారు.
5. ఎదుటి వారికి కాళ్లు చూపిస్తూ కూర్చోకూడదు. అలాగే తలపై ఎవరినీ కొట్టకూడదు. అలా చేస్తే ఫైన్ ఏమీ విధంచరు. కానీ ఈ పనులు చేసిన వారిని అసహ్యంగా చూస్తారు.
6. సింగపూర్‌లో మెట్రో రైళ్లలో ప్రయాణించేటప్పుడు తిండి తినకూడదు. నీళ్లు తాగరాదు. ఆ పనులు చేస్తే రూ. 23 వేల వరకు ఫైన్ వేస్తారు.
7. సింగపూర్‌లో అన్‌సెక్యూర్డ్ వైఫైకి కనెక్ట్ అయితే అక్కడి కంప్యూటర్ మిస్‌యూజ్ యాక్ట్ ప్రకారం ఏకంగా.. రూ.4.62 లక్షల జరిమానా విధిస్తారు.
8. సింగపూర్‌లో ఇతరులకు గిప్ట్‌లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గిఫ్ట్‌లను ప్యాక్ చేసేందుకు ఏ కలర్ ర్యాపర్‌నైనా వాడవచ్చు. కానీ తెలుపు రంగు ర్యాపర్‌లను వాడకూడదు. అలాగే గడియారాలు, పువ్వులు, హ్యాండ్ కర్చీఫ్‌లను అక్కడ చెడుగా భావిస్తారట. కనుక వాటిని గిఫ్ట్‌లుగా ఇవ్వరాదు. ఇక ఎడమ చేత్తో కాకుండా ఎప్పుడూ కుడి చేత్తోనే అక్కడ ఇతరులకు గిఫ్ట్‌లు ఇవ్వాల్సి ఉంటుంది.
9. సింగపూర్‌లో బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగితే 200 డాలర్ల ఫైన్ వేస్తారు.
10. సింగపూర్‌లో గోడలపై గ్రాఫిటి పెయింటింగ్ వేస్తే జైలు శిక్ష విధిస్తారు. అలాగే ఇతరులను వేలితో చూపించరాదు. దాన్ని అమర్యాదగా భావిస్తారు. ఇక అక్కడ కూడా డ్రగ్స్ వాడకంపై నిషేధం ఉంది.