పేదల ఆకలిని తీరుస్తున్న అన్నదాత.. 10 రుపాయలకే అన్నీ..

-

రోజు రోజుకు సామాన్యుల పై భారం పెరిగి పోతుంది..ఊహించని విధంగా వస్తువుల ధరలు పెరుగుతూ జనాలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. వంట గ్యాస్ నుంచి ఉప్పు, పప్పు, నూనె ఇలా ఒకటేమిటి అన్నీ వస్తువుల పై ధరల మోత మోగి పోతుంది..కడుపు నిండా తినడానికి కూడా వీలు లేకుండా పోయింది.అలాంటిది బయటకు వెళ్ళి టిఫిన్ చెద్దామని అనుకుంటే 50, 60 రూపాయలు ఉంటుంది.ఎటు చూసిన ఆకలి దప్పులు తప్పలేదు..ఇలాంటి పరిస్థితుల లో ఓ వ్యక్తి 10 రూపాయలకే రుచికరమైన టిఫిన్ ను అందిస్తున్నారు.

ఇలాంటి సమయాల్లొ కూడా 10 రూపాయలకు ఏదైనా టిఫిన్ ను ఇవ్వడం అనేది కష్టం..కానీ ఇలాంటి పరిస్థితులలో కూడా కేవలం పది రూపాయలకే ఆకలిని తీరుస్తున్నారు.. నిజంగా వీరిది ఎంత పెద్ద మనసొ అనేది అందరి నోట్లో నానుతుంది.ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 13 ఏళ్లుగా ఇలానే టిఫిన్ ను అందిస్తున్నారు..ఆయన టిఫిన్ రుచి , సుచి ఉంటుంది.. అందుకే రోజు రోజుకు అతని టిఫిన్ సెంటర్ ఫెమస్ అవుతుంది..కొన్ని ఏళ్ళుగా టిఫిన్ చేస్తున్న వాళ్ళు కూడా ఉండటం విశేషం..

ఈ టిఫిన్ సెంటర్ కర్నూల్ లో ఉంది.టిఫిన్ సెంటర్లు మొబైల్ క్యాంటీన్ ఇలా ఎక్కడ చూసినా హోటళ్లు.. ఒక్కో దాంట్లో ఒక్కో రేటు. ఏ టిఫెన్‌కు ఆ టిఫెన్‌ రేటు వేరుగా ఉంటుంది. ఇడ్లీ రేటు 30 రూపాయలు ఉంటే..దోశ రేటు 50రూపాయలు. అంతేనా ఒక చోట ఇడ్లీ ప్లేటు 30 రూపాయలు ఉంటే, మరో చోట 60, ఇంకో చోట ఏకంగా 250 ఉంటుంది. కానీ ఈ టిఫెన్‌ సెంటర్‌లో ఏ టిఫెన్‌ అయినా అక్షరాల పదిరూపాయలే ..అంత తక్కువ ధరకు ఏం టిఫిన్ వస్తుంది అనుకుంటే మాత్రం అది తప్పే అవుతుంది..క్వాలిటీ, క్వాంటిటీ మాత్రం ధరలు పెరిగినా కూడా తగ్గలేదు.18 మంది పని చేస్తూ హోటల్ నడుపుతున్నారు. వీరంతా ఉదయం 6 గంటలకే హోటల్ తెరిచి టిఫిన్స్ రెడీ చేసి పెడతారు. అన్ని హోటల్స్ లాగే ఇక్కడ కూడా ఇడ్లీ, వడ, దోసె, పూరి,మైసూర్ బోండా, ఉగ్గాని బజ్జిలు ఉంటాయి. ఉదయం 6 గంటల నుంచే కస్టమర్స్ రావడం మొదలు పెడతారు. ఉదయం నుంచి 12 గంటల వరకు మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. హోటల్ ఉంటుంది…అతని పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది… ఆకలిని తీరుస్తున్న అన్నదాత గా అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news