ఇంట్లో ఉన్న వారందరికీ ఏ కష్టాలు లేకపోతేనే అందరూ సంతోషంగా ఉంటారు. నిత్యం సంతోషంగా జీవిస్తారు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. అయితే ఎవరికైనా సమస్యలు వస్తే ఏ ఒక్కరూ నిద్రపోరు. అందరూ కలసి కట్టుగా ఉండి సమస్యలను ఎదుర్కొంటారు. కానీ ఇంట్లో ఏదైనా వాస్తు దోషం ఉంటే మాత్రం అది ఆ ఇంట్లో ఉండే వారందరిపై ప్రభావం చూపిస్తుంది. కనుక ఇలాంటి పరిస్థితి ఉన్నవారు ముందుగా ఇంట్లో ఉన్న వాస్తు దోషాన్ని తొలగించుకోవాలి. అందుకు కింద తెలిపిన సూచనలు పాటించాలి.
* ఇంట్లో డబ్బును ఉంచే లాకర్ లేదా కప్‌బోర్డ్‌ల తలుపులను ఉత్తరం వైపుకు తెరిచి ఉంచేలా చూసుకోవాలి. దీంతో ధనం సిద్ధిస్తుంది. ఆర్థిక సమస్యలు ఉండవు. అలాగే కప్‌బోర్డు వల్ల చీపుళ్లు, డస్ట్ బిన్స్‌ను ఉంచరాదు.
* నీటిలో కొద్దిగా ఉప్పు కలిపి ఇల్లంతా రోజూ చల్లాలి. ఒక్క గురువారం తప్ప మిగిలిన రోజుల్లో ప్రతి రోజూ ఇలా చేయాలి. దీంతో ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇంట్లోని వారికి ఉండే సమస్యలు తగ్గుతాయి.
* ఇంట్లో ఈశాన్యం వైపుకు ఒక గ్లాస్ బాటిల్‌లో కొద్దిగా ఉప్పు వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యలు ఉండవు. ధనం బాగా సంపాదిస్తారు.
* ఇంట్లో నిద్రపోయే ప్రదేశం దగ్గర, కిచెన్ సమీపంలో పూజ మందిరాన్ని ఉంచరాదు. ఇది అశుభాలను కలిగిస్తుంది. ఇంట్లో ఉన్నవారు కలహాలు పెట్టుకుంటారు. ఎప్పుడూ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతుంటాయి.
* ఇంట్లో లేదా బయట బాత్‌రూమ్‌లు ఉంటే వాటిని ఉపయోగించాక ఎల్లప్పుడూ మూసి ఉంచాలి. లేదంటే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది అశుభాలను కలిగిస్తుంది.
* కిచెన్ లేదా బాత్‌రూమ్‌లు, ఇంట్లో ఏదైనా ప్రదేశంలో ఉన్న నల్లాల నుంచి నీరు లీక్ కాకుండా చూసుకోవాలి. లీక్ అయితే ధనం కూడా అలాగే ఖర్చు అవుతుంది. ఆర్థిక సమస్యలు ఉంటాయి. కనుక నల్లాల నుంచి నీటిని లీక్ కాకుండా చూసుకోవాలి.
*ఈశాన్య దిశలో ఇంట్లో ఒక తులసి మొక్కను పెంచాలి. దీని వల్ల ఇంట్లో సంతోషం నెలకొంటుంది. ప్రశాంతత ఉంటుంది. కుటుంబ కలహాలు ఉండవు. సమస్యలు తొలగిపోతాయి.
* బెడ్‌రూమ్‌లో మంచాలకు ఎదురుగా అద్దం ఉండరాదు. ఉంటే దంపతుల మధ్య కలహాలు వస్తాయి. కనుక అలాంటి ప్రదేశాల్లో ఉండే అద్దాలను వెంటనే తొలగించాలి.
* ఇంట్లో పగిలిన అద్దాలను పెట్టుకోరాదు. వాటి వల్ల అశుభాలు కలుగుతాయి. నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుంది. కనుక పగిలిన అద్దాలను వెంటనే పడేయాలి.
* ముళ్లు, నరికిన చెట్లను ఇంట్లో, ఇంటి పరిసరాలలో లేకుండా చూసుకోవాలి. లేదంటే వాస్తు దోషం ఉంటుంది. ఇంట్లో ఉండే వారందరికీ అనారోగ్య సమస్యలు వస్తాయి.