సోదరి బ్రెయిన్ కాన్సర్ కారణంగా పదేళ్ల చిన్నారి పక్షుల ఆహారం అమ్మి…!

-

అల్లరి చేసి బడికి వెళ్ళను అని మారం చేసే చిన్నారులు వున్న ఈ రోజుల్లో బల్ల మీద పక్షుల ఆహారం పెట్టి అమ్ముతున్నాడు పదేళ్ల బాలుడు. నిజంగా ఈ సంఘటన విన్న ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్నారు. ఈ సంఘటన ఎక్కడో కాదు మన హైదరాబాద్ లోనే చోటు చేసుకుంది. సోదరి బ్రెయిన్ క్యాన్సర్ చికిత్స కారణంగా ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని ఈ బాలుడు కష్టపడుతున్నాడు.

పన్నెండేళ్ల సోదరి కోసం పదేళ్ల తమ్ముడు సయ్యద్ అజీజ్ డబ్బుల కోసం శ్రమిస్తున్నాడు. రెండేళ్ల క్రితం సోదరికి బ్రెయిన్ సర్జరీ అయింది. అప్పటి నుండి కుటుంబం మరింత దీనస్థితికి చేరుకుంది. అందుకని కుటుంబానికి అండగా ఉండాలని పక్షులకు వేసే ఆహారాన్ని అమ్ముతున్నాడు ఈ బాలుడు.

అయితే ఒక పక్క పక్షులు ఆహారాన్ని అమ్ముతూ.. మరొక పక్క విద్యనభ్యసిస్తున్నాడు. ఉదయం 6 గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ పక్షుల ఆహారాన్ని అమ్మి.. ఆ తర్వాత ఎనిమిది గంటలకి స్కూల్ కి వెళ్లి 5 గంటలకి వచ్చేవాడినని చెప్పాడు. తన తల్లి గత రెండేళ్ల నుంచి కుటుంబంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ అయ్యాయని తన కొడుకు కూడా కష్టపడుతున్నాడు అని చెప్పారు.

తన కూతురి ఆరోగ్యం పై మేము చాలా భయపడ్డాము కానీ సర్జరీ బాగా అయిపోయిందని ఆమె చెప్పారు. అయితే కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకుని నా కొడుకు ఉదయాన్నే పక్షుల ఆహారాన్ని అమ్ముతున్నాడని.. రోడ్డు మీద బల్ల వేసుకుని ప్రతి రోజు ఉదయం తన పని చేస్తున్నాడు అని చెప్పింది. నిజంగా చిన్న వయసులోనే కుటుంబ కష్టాన్ని అర్థం చేసుకోవడం.. కష్టపడడం చూస్తే ఆ బాలుడి మనసు ఎంత విశాలమో తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news