కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రపంచమంతటా వాక్సినేషన్ జరుగుతోంది. ఇది ఇలా ఉండగా స్పానిష్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది అని WHO అంటోంది. వందేళ్ల క్రితం దాదాపుగా ఐదు కోట్ల మంది వరకూ ఈ స్పానిష్ ఫ్లూ కారణంగా చనిపోయారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లో టాప్ ఎక్స్పెక్ట్ ఈ స్పానిష్ ఫ్లూ తిరిగి రావచ్చు అని అంటున్నారు. బ్రిటిష్ వార్తాపత్రిక రిపోర్టు ప్రకారం, WHO డాక్టర్ John Mc cauley అది మరింత ప్రమాదకరం అని, దాని కారణంగా ఎక్కువ మరణాలు సంభవిస్తాయి అని అంటున్నారు.
ఇప్పటికే ప్రపంచమంతా కూడా కోవిడ్ 19 కారణంగా సతమతమవుతోంది. మరో పక్క సైంటిస్టులు తర్వాత వచ్చే ప్రమాదాన్ని కనుగొన్నారు. డాక్టర్ జాన్ ఏమన్నారంటే కామన్ ఫ్లూ ఇప్పుడు కలిగే ప్రతీ ప్రమాదం కి కారణం అని అంటున్నారు. ఈ ఫ్లూ అనేది మరిన్ని వైరస్ లకి దారి తీస్తుందని డాక్టర్ అన్నారు.
రోగనిరోధక శక్తిని తగ్గిపోవడం:
డాక్టర్ జాన్ ఏమంటున్నారంటే సోషల్ డిస్టెన్స్ పాటించడం మరియు రెగ్యులర్ గా హ్యాండ్ వాష్ చేసుకోవడం లాంటివీ కరోనా సమయం లో పాటించాము. కానీ కరోనా అయిపోయిన తర్వాత కొన్ని సీజనల్ గా వచ్చే జబ్బులు మరింత ప్రమాదంగా మారే అవకాశం ఉంది అన్నారు. రోగనిరోధక శక్తి తగ్గిపోవడమే అంతటికి కారణం అని అన్నారు.
బ్రిటన్ ఇప్పటికీ అక్కడ ప్రజల్ని వార్న్ చేసింది. వచ్చే చలి కాలానికి ఈ ఫ్లూ మరింత పెరుగుతుంది అని అక్కడ చెప్పారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ లో ప్రచురించబడిన రీసెర్చ్ లో కరోనా వైరస్ మరియు ఫ్లూ కి ఎఫెక్ట్ అయిన వాళ్ళు హైరిస్క్ ఎదుర్కోవాలి అన్నారు. ఇది ఇలా ఉండగా 1918 వ సంవత్సరంలో స్పానిష్ ఫ్లూ వల్ల ప్రపంచ జనాభాలో 1/3 ఎఫెక్ట్ అయ్యారు. అప్పుడు పక్షులే దీనికి కారణం. సుమారుగా 5 కోట్ల మంది స్పానిష్ ఫ్లూ కారణంగా చనిపోయారు. మొదటి ప్రపంచ యుద్ధం లో కంటే స్పానిష్ ఫ్లూ వల్ల ఎక్కువ మంది చనిపోయారు డాక్టర్ జాన్ దీనికి మనం సిద్ధంగా ఉండాలి అన్నారు.