వైరల్ : 70 ఏళ్లు దాటిన చెట్లకు పింఛన్- ఎందుకంటే?

-

ఇకపై ఆ రాష్ట్రంలో చెట్లకు కూడా పింఛన్ ఇవ్వనున్నారు. అంటే మనుషులకు వృద్ధాప్య పింఛన్ ఎ​లా ఇస్తున్నారో అలానే వయసు ఎక్కువ ఉన్న చెట్లకు నగదు సాయం అందించాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధి పొందే చెట్ల వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించింది. 70 ఏళ్ల పైబడిన చెట్లను గుర్తించాలని ‘వన్ భవన్’ నుంచి ఆదేశాలు జారీ అయినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. చెట్ల జాబితా తయారు చేసే బాధ్యతను రేంజ్ అధికారులకు అప్పగించినట్లు చెబుతున్నారు.

వేప, మామిడి, జామ, ఇండియన్ రోజ్​వుడ్, తుమ్మ, రావి చెట్లకు ఈ పింఛన్ అందించనున్నారు. అయితే నీలగిరి, చైనాబెర్రీ చెట్లను ఈ పథకం నుంచి మినహాయించినట్లు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఒక్కో గ్రామానికి వెళ్లి చెట్ల వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నిజానికి రాష్ట్రంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి కన్వర్​పాల్ గుర్జర్ మాట్లాడుతూ అధిక వయసు ఉన్న చెట్లకు పింఛన్లు ఇస్తే వాటిని సంరక్షించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాని ప్రకారం రాష్ట్ర అటవీ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా అమలులోకి తీసుకు వస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news