పంజాబ్ నుంచి ఏపీకి 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు..

-

తుపాన్ ప్రభావం ఏపీ రాష్ట్రంపై తీవ్రంగా చూపింది. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుడటంతో వాగులు, వంకలు, చెరువులు పొంగి పొర్లడంతో పాటు లొతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి అందే సహాయ సహకారాలు అంతంత మాత్రం గానే ఉండటంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు ఉమ్మడి జిల్లాల్లోని పలు ప్రాంతాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. రోడ్ల మీద వరద నీరు పేరుకుని పోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

ఇప్పటికీ ఏపీలోకి కొన్ని ప్రాంతాలు వరదల్లో చిక్కుకుని ఉండటంతో సామాన్య ప్రజలను రక్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని రిక్వెస్ట్ చేయగా, పంజాబ్ నుంచి ప్రత్యేక ఆర్మీ విమానంలో 100 మంది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాష్ట్రానికి చేరుకున్నాయి. అంతేకాకుండా సీఎం చంద్రబాబు ఇతర రాష్ట్రాలతో కూడా మాట్లాడి రాష్ట్రానికి సాయం అందించాలని కోరినట్లు తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. మరో రెండ్రోజుల పాటు ఏపీకి భారీ వర్ష సూచన ఉన్నందున సీఎం ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై సత్వర చర్యలు చేపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news