విజయవాడ నగరానికి అమావాస్య గండం వచ్చింది పడింది. అమావాస్య కారణంగా పోటు మీదుంది సముద్రం. పోటు మీదుంటే వరదని తనలోకి ఇముడ్చుకోలేదట సముద్రం. వరద జలాలు సముద్రంలో కలవకుంటే ముంపు భయం పెరగనుందని సమాచారం. ఎగువ నుంచి భారీ వరద.. దిగువన సముద్ర పోటుతో ఏం జరుగుతుందోనని బెజవాడ ప్రజలు భయపడుతున్నారని సమాచారం.
రాత్రి 12 గంటల తర్వాత.. అమావాస్య గడియలు ముగిశాకే సాధారణ స్థితికి రానుంది సముద్రం. ఎగువ నుంచి వచ్చే వరద తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటున్నారు అధికారులు. అంచనా ప్రకారం వరద తగ్గుముఖం పట్టకుంటే నిజయవాడలో పరిస్థితి ఆందోళనకరంగా మారే సూచనలు ఉన్నాయని సమాచారం. మరో వైపు బుడమేరు ఉదృతి తగ్గడం లేదు.