హోటళ్లకు తరలిస్తున్న వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టివేత..!

-

ఏరా రోజు ఇంట్లో ఫుడ్డేనా ఇవాళ అలా బయట రెస్టారెంట్‌లో తినొద్దాం పదరా.. అంటూ ఫ్రెండ్స్ రెస్టారెంట్స్‌కు వెళ్లి లొట్టలేసుకుంటూ మటన్ బిర్యానీ.. చికెన్ బిర్యానీ.. లేదా నాన్ వంటకాలను లాగించి వస్తుంటారు. ఏమండీ ఇవాళ రాత్రి డిన్నర్ బయట చేద్దామండి.. అని భార్య భర్తను బుజ్జగించగానే భర్త కూడా సరేనంటాడు. ఓ రెస్టారెంట్‌కు వెళ్లి ఫుల్లుగా లాగించి వస్తారు. అసలు.. మీరు రెస్టారెంట్లలో తినే మటన్ గొర్రె లేదా మేక మాంసమేనా? చికెన్ … కోడిదేనా అన్న డౌట్ మీకు ఎప్పుడన్నా వచ్చిందా? రాకుండొచ్చు.. ఎందుకంటే.. మటన్‌ను గొర్రె, మేక నుంచి కాకుండా ఇంకా ఎక్కడ నుంచి తెస్తారు అని అంటారా? అయితే మీరు ఈ వార్త చదవాల్సిందే.

తమిళనాడులోని చెన్నైలో ఉన్న ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌లో వెయ్యి కిలోల కుక్క మాంసాన్ని పట్టుకున్నారు పోలీసులు. ఐదో నెంబర్ ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా ఉన్న ఓ పార్శిల్‌ను విప్పి చూసి కంగుతిన్నారు పోలీసులు. రాజస్థాన్ నుంచి చెన్నై వచ్చిన జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఆ పార్శిల్‌ను దింపారు. అయితే.. అంతకు ముందే పోలీసులకు కుక్కల మాంసాన్ని జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లో స్మగ్లింగ్ చేస్తున్నట్టు సమాచారం అందింది. దీంతో.. అక్కడికి చేరుకున్న పోలీసులు పార్శిల్‌ను ఓపెన్ చేసి మాంసాన్ని పరీక్షించి అది కుక్కల మాంసంగా తేల్చారు. చెన్నైలోని రెస్టారెంట్లకు ఆ మాంసాన్ని తరలించడానికి రాజస్థాన్ నుంచి ట్రెయిన్ ద్వారా స్మగ్లింగ్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మాంసం శాంపిళ్లను పరీక్షల కోసం తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news